ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:38 PM
గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిర్సనగండ్ల సర్పంచ్ రామస్వామి అ న్నారు.
వంగూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిర్సనగండ్ల సర్పంచ్ రామస్వామి అ న్నారు. గురువారం మండలం శిరసనగండ్లలో హనుమాన్‌టెంపుల్ వద్ద వీధిలైట్లు ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో అందరం కలిసి నడుద్దామన్నారు. కార్యక్రమంలో ఉప స ర్పంచ్ సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గ్గొన్నారు.
పారిశుధ్యం కోసం ప్రణాళిక
కోడేరు, (ఆంధ్రజ్యోతి) : గ్రామంలో పారిశు ధ్యం మెరుగుకోసం గ్రామంలో వాడవాడ తిరిగి మురికి కాలువల నిర్మాణం పరిశీలిస్తున్నామని సర్పంచు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపై మురుగునీరు నిలుచుండగా వార్డు సభ్యులతో క లిసి పరిశీలించారు. గుట్ట కాలనీలో సైడ్ కాలువల నిర్మాణం తన సొం త నిధులతో ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ఆయన వెంట వార్డు సభ్యు లు శరత్‌బాబు, రామకృష్ణ, మాస య్య, సిబ్బంది ఉన్నారు.
ముమ్మరంగా డ్రైనేజీ పనులు
తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : సర్పంచ్ కొమ్ము శేఖర్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం కాలనీ, కొత్త ప్రహ్లాదరావు కాలనీల మధ్యలోని స్థానిక చర్చి దగ్గర ఏళ్లుగా ఉన్న మురుగు కాలువ సమస్యను జేసీబీతో మెరుగు పరిచే పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వారణా సి శ్రీను, సొంటే మల్లేష్, ఈవో భాస్కర్, కన్యకా మరమేశ్వరి కాలనీవాసులు వెంకటేష్, గుండూర్ శ్యామ్, గుండ్రాతి రాజు, గుండూర్ రాఘవేందర్, భోగరాజు, మధు, అర్జున్ పాల్గొన్నారు.