ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:10 PM
రాష్ట్ర, జిల్లా స్థాయి లో నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నాగ ర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో ష్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర, జిల్లా స్థాయి లో నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నాగ ర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో ష్ అధికారులను ఆదేశించారు. జి ల్లా కేంద్రంలోని ప్రజావాణి మీటిం గ్ హాల్‌లో సోమవారం నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ప్రజలు 48అర్జీలు అందాయి. జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహా యంతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి దర ఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటి వరకు ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్ర మంలో కలెక్టరేట్ విభాగాల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 5 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ క్రైం, (ఆంధ్రజ్యోతి) : పోలీస్ ప్రజావాణికి ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ గైక్వాడ్‌వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ఫిర్యాదుదారుల నుంచి భూమికి సంబంధించి 2, తగు న్యాయం గురించి 3 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.