Share News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:41 PM

ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి కృషిచేస్తానని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం నాంపెల్లిలో కేంద్రం సంఘం అద్యక్షుడు మారం జగదీశ్వర్‌రెడ్డి అద్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొ న్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
వినతి పత్రం అందజేస్తున్న టీఎన్‌జీవో జిల్లా అద్యక్షుడు గడియారం శ్రీహరి

టీఎన్‌జీవో జిల్లా అద్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల క్రైం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి కృషిచేస్తానని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం నాంపెల్లిలో కేంద్రం సంఘం అద్యక్షుడు మారం జగదీశ్వర్‌రెడ్డి అద్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్‌జీవో సభ్యత్వ నమో దును మంచిర్యాల జిల్లాలో డిసెంబర్‌ వరకు పూర్తి చేస్తామన్నారు. ఉద్యో గుల సమస్యలైన సీపీఎస్‌ విఽధానాన్ని పాత పెన్షన్‌ విదానం రావడానికి ప్ర ణాళిక తయారు, డీఏలను త్వరగా ఇప్పించేందుకు, జిల్లా టీఎన్‌జీవో హౌజింగ్‌ సొసైటీ భూములను నిషేదిత జాబితానుండి తొలగించుటకు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:41 PM