kumaram bheem asifabad- సహకార సంఘాల పెంపునకు కసరత్తు
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:17 PM
కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణ కు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో మూడు కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- సింగిల్‌విండోల పాలక వర్గాలు రద్దు
- అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఉత్తర్వులు
కాగజ్‌నగర్ టౌన్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణ కు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో మూడు కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీలు, పీఏఎస్‌ఎస్‌లకు అధికారు లను ఇన్‌చార్జీలుగా నియమించేలా సహకార శాఖ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సహకారం సం ఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు (పీఎసీఎస్)లతో పాటు రైతు సేవా సహకార సంఘాలు, (ఎఫ్‌ఎస్‌సీఎస్) సహకార బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన అన్ని పీఎసీఎస్‌లు, డిసీసీబీలు రద్దు చేసింది. ఆయా సొసైటీల పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగియగా ఆగస్టు చివరి వరకు ప్రభుత్వం పెంచింది. అది కూడా గడువు ముగియడంతో ఫిబ్రవరి వరకు మరోసారి పొడిగించింది. కాగా ఫిబ్రవరిలో గడువు ఇంకా ముగియకుండానే పాలక వర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికలు త్వరలోనే నిర్వహించనున్నారనే చర్చ జరుగుతోంది.
- జనవరిలో అవకాశం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకవర్గాలకు వచ్చే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించేందుకే ప్రస్తుత పాలక వర్గాలను ప్రబుత్వం రద్దు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటి స్థానంలో నిర్వహణ బాధ్యతలను పర్సన్ ఇన్‌చార్జీలకు ప్రభుత్వం అప్పగించింది. దీంత ఆయా సొసైటీల నిర్వహణను పర్సన్ ఇన్‌చార్జీల ద్వారా ఎన్నికలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సొసైటీల్లో ఉన్న సభ్యులు, గతంలో ఓటు హక్కు ఉన్న వారు ఎంత మంది, కొత్తగా ఎంత మంది ఓటు హక్కు అర్హత ఉందన్న వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల చివరి వారం లేదా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలనే విషయంలో చర్చించుకుంటున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 12 సొ సైటీలు ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెజ్జూరు, సిర్పూర్(టి), రెబ్బెన, దహెగాం, గురుడుపేట, తిర్యాణి, వాంకిడి, కెరమెరి, బూర్నూ రు, జైనూరు మండలాల పరిధిలోనివి ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు కొత్త సొసైటీలు కొత్త మండలాలైన పెంచికలపేట, చింతలమానెపల్లి, లింగాపూర్‌లో ఏర్పడే అవకాశాలున్నాయని సిబ్బంది చెబుతున్నారు. నూతన మండలాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పాలక వర్గాల రద్దు సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో వివరాలు పొందు పరిచినట్లు చెబుతున్నారు. సొసైటీలు నూతనంగా ఏర్పాటు చేయాలని ఆయా సొసైటీల పర్సన్ ఇన్‌చార్జిలను ఆదేశించింది. కానీ నూతన పాలక వర్గాలు ఏర్పడాలంటే 1964 సహకార చట్టం ప్రకారం ఈజీగా జరిగేది కాదని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సంఘాల్లో ఆయా మండలాల రైతులను కలిపే అవకాశాలున్నాయి. అయితే సొసైటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓటు హక్కుపై చర్యలు జరుగుతున్నా యి. రైతులు, వారి పాసు పుస్తకాలు తదితర విషయాలపై సహకార శాఖ నిబంధనల మేరకు వర్తిస్తాయి. ఓటు హక్కు ఎవరికి కల్పిస్తారనే విష యం తేలితే ఎన్నికల అంశం వివరాలు పూర్తి స్థాయిలో వస్తాయి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మరింత ముందుకు వెళ్లవచ్చు.
- రైతులకు ప్రయోజనకరంగా..
వ్యవసాయంలో రైతులకు అన్నిరకాలుగా ప్రయోజ నకరంగా ఉండే సహకార సంఘాల సేవ లను విస్తరిస్తుండడంతో మరింతగా ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను కూడా విభజించే నిర్ణయానికి రావడం గమనార్హం. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉండగా, ఏ అవసరం వచ్చినా క్యూలు కట్టాల్సి వస్తోంది. ప్రతీ సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక డీసీసీబీ ఉంది. వాటి పదవీ కాలం ముగియడంతో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనివా ర్యమైంది. పంచాయతీ ఎన్నికల కారణంగా సహకా ర సంఘాల పదవీ కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప ్పటికీ, పంచాయతీ పోరు ముగిసినందున ప్రభుత్వం వాటిపై దృష్టి సారించిం ది. ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినందున జిల్లాలో మండలానికో పీఏ సీఎస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో కొత్త పీఏసీ ఎస్‌లతోపాటు డీసీసీబీ ఏర్పాటైతే ఆయా సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నిక జిల్లాల వారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా లోని రైతులకు సహకార సంఘాల సేవలు సైతం విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.