సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:28 PM
మండల కేం ద్రంలో జరుగుతున్న రోడ్డు వి స్తరణ పనులను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం పరిశీలించారు.
- రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలో జరుగుతున్న రోడ్డు వి స్తరణ పనులను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులు చేపట్టడం ద్వారా కొన్ని ఇబ్బం దులు ఎదురవుతున్నాయని, ప్రజలు సహకరిస్తే రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే పూర్తవుతా యని తెలిపారు. ఈ పనులకు ఎవరైనా ఆటం కాలు కల్గిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోను న్నట్లు హెచ్చరించారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాసుమల్ల వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరి నారాయ ణగౌడ్, నాయకులు మల్లికార్జున్, రాజగోపాల్, బాల్‌లింగంగౌడ్, ముక్రంఖాన్, తిరుపతయ్య గౌడ్, మనోహర్ పాల్గొన్నారు.
10న మెగా క్యాంపు
అచ్చంపేటటౌన్ : ఈ నెల 10వ తేదీన నిర్వ హించే మేఘా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 6న పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో జరగాల్సిన మెఘా సర్జికల్ క్యాంపును కొన్ని కారణాల వల్ల ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు తెలి పారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పేదవాడి ఆత్మగౌరవ ప్రతీక రేషన్‌కార్డు
అచ్చంపేట : పేదవాడి ఆత్మగౌరవ ప్రతీక రేషన్‌కార్డు అని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు. శనివారం లింగాల మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారని ఆయన ఎద్దేవాచేశారు. నాయకులు శ్రీనివాస్ రాథోడ్, రాజు నాయకులు ఉన్నారు.