Share News

నల్లమల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:31 PM

పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫారెస్టు డివిజనల్‌ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రారంభించారు.

నల్లమల అభివృద్ధికి కృషి
భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, పారెస్టు అధికారులు

- ఫారెస్ట్‌ డివిజనల్‌ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫారెస్టు డివిజనల్‌ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రారంభించారు. డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి ఎమ్మె ల్యేకు మొక్కను అందజేసి శాలువాతో సత్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని హగులతో భవనాన్ని నిర్మించినట్లు ఎమ్మె ల్యే తెలిపారు. నల్లమల ప్రాంతాన్ని అన్ని వి ధాలా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం హబ్‌ గా మార్చేందుకు పక్కాప్రణాళికలు సిద్ధం చేస్తు న్నామన్నారు. ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.

అమరేశ్వర దేవస్థాన అభివృద్ధికి కృషి

అమ్రాబాద్‌ : మండల కేంద్రంలోని అమరేశ్వ ర దేవస్థానం అభివృద్ధి కమిటీకి అన్ని విధాలుగా కృషి చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం ఆలయ కమిటీ సభ్యు లు ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయలో క లిసి దేవీ నవరాత్రుల ఉత్స వాలకు సంబంధించిన కర పత్రాలను విడుదల చే యించి ఆహ్వానపత్రికను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ ఆలయ ఆవరణలో హైమాస్టు లైట్లు తక్ష ణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నవరా త్రి ఉత్స వాలకు వచ్చేటప్పుడు ఆలయ అభివృద్ధి కోసం రూ.10లక్షల ప్రొసీడింగ్‌ తీసుకొస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో అమ రేశ్వర ఆలయ కమిటీ తిప్పర్తి శ్రీనివా స్‌, ఉపాధ్యక్షుడు గోలి వెంకటయ్య, ప్రధాన కా ర్యదర్శి యుగంధర్‌గౌడ్‌, కోశాధికారి సురేష్‌గౌడ్‌, ప్రచార కార్యదర్శి రాజుపటేల్‌, కాంగ్రెస్‌ నేతలు బాల్‌ లింగంగౌడ్‌, లక్ష్మణాచారి, వెంకటేశ్వర్లు, కోటి పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:31 PM