Share News

బుద్ధవనం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:54 AM

అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రాజెక్టుకు కులమతాలు, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయడానికి తన వం తుగా కృషి చేస్తానని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

 బుద్ధవనం అభివృద్ధికి కృషి
ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం సందర్భంగా బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద అంజలిఘటిస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, మల్లేపల్లి లక్ష్యయ్య, బాలీవుడ్‌ నటుడు గగనమాలిక్‌

బుద్ధవనం అభివృద్ధికి కృషి

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

బుద్ధవనంలో ఘనంగా ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం హాజరైన బాలీవుడ్‌ నటుడు గగనమాలిక్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి

నాగార్జునసాగర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రాజెక్టుకు కులమతాలు, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయడానికి తన వం తుగా కృషి చేస్తానని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా బుద్ధవనంలో నిర్వహించిన ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవానికి ఆయన ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే జైవీర్‌ రెడ్డి, బాలీవుడ్‌ సినీనటుడు గగనమాలిక్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఐపీఎస్‌ చారుసిన్హా బహూకరించిన గయ నుంచి తీసుకువచ్చిన బోధి మొక్కను ధ్యానవనంలో మాజీ మంత్రి నాటారు. అనంతరం మహాస్తూ పం దిగువన ఉన్న సమావేశ మందిరంలో బుద్ధజ్యోతిని వెలిగించారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం చాంటింగ్‌ (ప్రార్థన) చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గౌతమ బుద్ధుని గొప్పతనాన్ని, సాధారణ జీవితాన్ని ప్రపంచమంతా పాటిస్తుందన్నారు. ధమ్మ జీవితాన్ని గడుపుతూ సంఘజీవిగా సమానత్వ సంఘాన్ని నిర్మించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ బుద్ధవనం సాగర్‌ హిల్‌కాలనీలో ఉండటానికి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కృషి ఎంతో ఉందని అన్నారు. బుద్ధవనాన్ని ఏపీలోని అనుపు వద్ద నిర్మించాలని నాటి పాలకులు చూస్తే జానారెడ్డి పట్టుబట్టి తె లంగాణలో సాగర్‌ హిల్‌కాలనీలో నిర్మించేలా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర సహకారంలో బుద్ధవనాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

చాకలి గట్టుపై కాటేజీలు ఏర్పాటు చేయాలి : మల్లేపల్లి లక్ష్మయ్య

అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న సాగర్‌ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు దేశ విదేశాలకు చెందిన బౌద్ధ మతస్థులు, మాంక్‌లు వచ్చి అదే రోజు వెళ్తున్నారు. వారు ఉండటానికి నా గార్జునకొండకు పక్కనే ఉన్న చాకలి గట్టుపై కాటేజీలు నిర్మిస్తే వారం రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందని బుద్ధవ నం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. చాకలిగట్టును ప ర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అంతేకాకుండా నాగార్జునకొండపై 150 అడుగులు ఎత్తులో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

పర్యాటక శాఖ లాంచీలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బాలీవుడ్‌ నటుడు గగన మాలిక్‌ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టును పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్‌ కమిటీ చైర్మన చంద్రశేఖర్‌రెడ్డి, బుద్ధవనం ఈవో శాసన, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ర విచంద్ర, డీఈ శ్రీనివా్‌సరెడ్డి, ఏఈ నజీస్‌, శ్యాం, సీఐ శ్రీను నాయక్‌, ఎస్‌ఐ మత్తయ్య, కేశవ్‌ అజ్మీర, ఎంజీయూ విద్యార్థులు మరియు బౌద్ధ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బుద్ధవనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

- గగన మాలిక్‌, బాలీవుడ్‌ నటుడు

బుద్ధవనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం, పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని బాలీవుడ్‌ నటుడు గగన మాలిక్‌ అన్నారు. ప్రపంచ దే శాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బుద్ధవనం ప్రాజెక్టు నిలుస్తుందని అన్నా రు. బుద్ధవనం ప్రశస్తిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి తన వంతుగా కృషి చే స్తాన్నారు. అనంతరం వరల్డ్‌ బ్యాంకు కన్సల్టెంట్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ ఉత్తర భారతదేశం నుంచి పర్యాటకులు బుద్ధవనానికి వచ్చేలా ఆకర్షించడానికి వరల్డ్‌బ్యాంకు సహకారం అందిస్తుందన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:54 AM