Share News

kumaram bheem asifabad- బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:04 PM

బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. . పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం బీజేపీకి చెందిన సిర్పూరు(టి) మాజీ ఎంపీపీ మాలతీ బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

kumaram bheem asifabad- బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీపీకి పార్టీ కండువా వేస్తున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. . పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం బీజేపీకి చెందిన సిర్పూరు(టి) మాజీ ఎంపీపీ మాలతీ బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుపేదలను నట్టేట ముంచాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ గతంలో చేపట్టిన పథకాలే నిరుపేదలకు వరంగా మిగిలినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈసుగాంలో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వైన్‌ షాపును వెంటనే తొలగించాలన్నారు. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జైనూరు మండలం అందుగూడ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు ఆదివారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కారాయలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు విశ్వనాథ్‌, రమేష్‌, బాబురావు, మంగేష్‌, శ్రవణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:04 PM