Share News

గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:38 PM

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రేచిని పంచా యతీ పరిధిలోని గజ్జలపల్లి హాబిటేషన్‌లోని తోటిగూడాన్ని సందర్శించా రు.

గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి
తోటి కులస్తులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

తాండూర్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రేచిని పంచా యతీ పరిధిలోని గజ్జలపల్లి హాబిటేషన్‌లోని తోటిగూడాన్ని సందర్శించా రు. తోటి కులస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ప్రభుత్వం అందుతున్న పథకాలు, గూడెంలోని సమస్యల గురించి తె లుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్య తీర్చేందుకు కొత్త బోర్‌వెల్‌ ఏ ర్పాటు చేయాలని, భీమన్న దేవుని ఆలయం షెడ్డు నిర్మాణానికి, కమ్యూ నిటీ హాలు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గజ్జ లపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలు ఎవరు లేకపో డంతో అంగన్‌వాడీ టీచర్‌ను మందలించారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, మండల పంచాయతీ అధికారి అనిల్‌కుమార్‌, ఏటీడీవో పురుషోత్తం, ఏఈ రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:38 PM