Share News

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:35 PM

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని డబ్బా గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం 83 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు ప్రత్యేకించి సిర్పూర్‌ నియోజక వర్గానికి కేసీఆర్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని చెప్పారు.

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధికి కృషి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

చింతలమానేపల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని డబ్బా గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం 83 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు ప్రత్యేకించి సిర్పూర్‌ నియోజక వర్గానికి కేసీఆర్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. మరుగున పడిపోయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును మళ్లీ తాను అసెంబ్లీలో పలు సందర్భాల్లో లేవనెత్తి తెర మీదకు తెచ్చానని అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలోనే కాకుండా జాతీయ రహదారి నిర్మాణం విషయంలో కూడా తాను చొరవ తీసుకున్నానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగక పోవడంతో ఆరు వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే పనులు మొదలు పెట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కర్జవెల్లి నుంచి గూడెం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపడుతుండగా ఆయన పనులను పరిశీలించారు. రన్‌వెల్లి, గంగా పూర్‌ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణా లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఏడీఏ మనోహర్‌, వ్యవసాయాధికారి కార్తీష, హౌసింగ్‌ ఏఈ సాహిల్‌, కార్యదర్శులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు మల్లయ్య రాము, విజయ్‌, మోతిరాం, నానయ్య, రంగన్న, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 10:35 PM