kumaram bheem asifabad- ఆదివాసీల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:04 PM
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా గిరిజన అభివృద్ధి రమాదేవిలతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా గిరిజన అభివృద్ధి రమాదేవిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఆదివాసీ, గిరిజనులు సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని, వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కుమరం భీం స్పూర్తిగా ఆదివాసీలు ముందుకు సాగాలని చెప్పారు. అకాంక్షిత బ్లాక్ కింద ఎంపికైన తిర్యాణి మండలం రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డు పొందిందని గుర్తు చేశారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అధికారుల సమన్వయంతో సాధ్యపడిందన్నారు. జీవో 49 రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత నివారణ కోసం పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తుదన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించి గుణాత్మక విద్యను అందించేదుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. జిల్లాకు నూతన వసతి గృహాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ ఆదివాసీలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ఆదివాసీల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. కుమరం భీం, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుస్సాడీనృత్యాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆదివాసీ భవన్‌కు ర్యాలీగా చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, అటవీ డివిజన్ అధికారి దేవిదాస్, గోండ్వానా మహాసభ నాయకులు అర్జు, జీసీడీవో శకుంతల, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, మాజీ ఎంపీ బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏసీఎంవో ఉద్దవ్ పాల్గొన్నారు.