Share News

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:28 PM

జిల్లా సర్వతోముఖాభివృ ద్ధికి అన్ని రంగాల్లో అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వ సం క్షేమ పథకాలు ప్రగతికి బాటలుగా మారాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు

అన్ని రంగాల్లో అభివృద్ధికి ఐక్యంగా ఉద్యమిద్దాం

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రగతికి బాటలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు

మంచిర్యాలకలెక్టరేట్‌, జూన్‌2 (ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వతోముఖాభివృ ద్ధికి అన్ని రంగాల్లో అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వ సం క్షేమ పథకాలు ప్రగతికి బాటలుగా మారాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుక లకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, పెద్దపల్లి ఎంపీ వంశీక్రిష్ణ, మంచిర్యాల బెల్లం పల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ర్టాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తె లంగాణ రైజింగ్‌-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంద న్నారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌లో ముఖ్యంగా పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్‌మెంట్‌, పారదర్శక సుపరిపాలనలాంటి లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాయన్నారు. ఈ విజన్‌ డాక్యు మెంట్‌ భవిష్యత్‌ తెలంగాణకు ఒక భగవద్గీత, ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీ శ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిం దన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో 2కోట్ల మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. రూ. 500లకే గ్యాస్‌ సరఫరా ద్వా రా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించామన్నారు. 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టామన్నారు. మహిళ సంఘాల ద్వా రా 600 బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకివ్వాలని నిర్ణయించా మన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో 25లక్షల పైచిలుకు మంది రైతులకు రుణవిముక్తి చేయించామన్నారు. 20వేల617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. జిల్లాలో రైతు రుణ మాఫీ పథకం కింద 64,452 మంది రైతన్నలకు 540 కోట్ల రూపాయల రు ణమాఫీ చేశామన్నారు. జిల్లాలో 2లక్షల మందికి పైగా కార్డుదారులకు ప్ర జా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. పారదర్శ కంగా కులగణన నిర్వహించి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా అప్పీలు వ్యవస్థను రూ పొందించింద్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచిందన్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రజలకు అందుబా టులో రూ.10కోట్ల22లక్షలతో రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మహాప్రస్థానం ని ర్మించడం జరిగిందన్నారు. అమృత్‌ 2.0 పథకం కింద అన్ని మున్సిపాలిటీ లకు 275 కోట్ల రూపాయలు మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉ న్నాయన్నారు. సింగరేణి నీటి బిందు జలసిందు పథకం కింద 62 కొత్త చెరువుల ఏర్పాటుతో పాటు 100 పాత చెరువలలో పూడికతీసి పునరుద్ధరించామన్నారు. రాష్ర్టాన్ని ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమి స్టేట్‌గా మార్చాలని ల క్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్ర కాశ్‌, జిల్లా అధికారులు దుర్గప్రసాద్‌, వెంకటేశ్వర్లు, పురుషోత్తం నాయక్‌, ఏవో రాజేశ్వర్‌, డీపీఆర్‌ఓ క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న స్టాళ్లు... పోలీసు పరేడ్‌

ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని డీఆర్‌డీఏ, శిశుసంక్షేమ, బీసీవె ల్ఫేర్‌, అడల్ట్‌ ఎడ్యూకేషన్‌, వ్యవసాయశాఖ, మత్స్య, వైద్య ఆరోగ్యశాఖ తది తర జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టాళ్లను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, వినోద్‌ సందర్శించి స్టాళ్లను ఏర్పాటు చేసినందుకు అధికారు లను అభినందించారు. వ్యవసాయశాఖ విత్తనాల బ్యాగులను పట్టుకొని పలు సూచనలు, సల హాలు అందజేశారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఆర్‌ఎస్‌ఐ శివకుమార్‌ నేతృత్వంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించి అనంతరం ఆద్యంతం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అదే విధంగా బైపాస్‌ రోడ్డ గల అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించారు.

కళాకారుల ఆటపాట...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఇతివృత్తాన్ని గేయా లుగా మలిచి పాడిన జానపద గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. వేడుకలకు ప్రారంభానికి ముందు ప్రత్యేక రాష్ర్టానికి బలిదానం చేసిన అమరవీరులను స్మరిస్తూ గీతాలు ఆలపించారు. తెలంగాణ ప్రగతికి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై గీతాలు ఆకట్టుకున్నాయి.

సోనియమ్మతోనే తెలంగాణ ఏర్పాటు

మంచిర్యాలక్రైం: సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఆవతరించిందని మం చిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవ సందర్భంగా ఆయన నివాసంలో జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భంగా నాలుగుకోట్ల ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూ ము ల నరేశ్‌, పూదరి తిరుపతి, పెంట రజిత, మామిడిశెట్టి వసుందర, తాజా మాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:28 PM