ED Raids: గోవాలో భూకబ్జా కేసు..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:58 AM
గోవాలోని అంజునాలో భూ కబ్జా కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గోవాలోని అంజునాలో భూ కబ్జా కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)-పణాజీ జోనల్ కార్యాలయ అధికారులు వరుసగా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. గోవాతో పాటు, హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో ఈడీ పత్యేక బృందాలు ఈ సోదాలు జరిపాయి. ఈ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్ సావంత్‌తో పాటు మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోమ, మంగళవారం జరిగిన సోదాల్లో రూ.72 లక్షల నగదు, ఏడు వాహనాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గోవాలోని కమ్యూనిడాడే భూముల కబ్జాకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తోంది.