Share News

kumaram bheem asifabad-పులుల రక్షణతో పర్యావరణ సమతుల్యత

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:27 PM

పులుల రక్షణతో పర్యావరణ సమత్యుల సాధ్యమవుతుందని ఆసిఫాబాద్‌ అటవీ డివిజన్‌ అధికారి దేవిదాస్‌ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఆసిఫాబాద్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు

kumaram bheem asifabad-పులుల రక్షణతో పర్యావరణ సమతుల్యత
ఆసిఫాబాద్‌లో ర్యాలీ ప్రారంభిస్తున్న అటవీ డివిజన్‌ అధికారి దేవిదాస్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పులుల రక్షణతో పర్యావరణ సమత్యుల సాధ్యమవుతుందని ఆసిఫాబాద్‌ అటవీ డివిజన్‌ అధికారి దేవిదాస్‌ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఆసిఫాబాద్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేంజ్‌ అధికారి గోవింద్‌ చంద్‌సర్దార్‌, డీప్యూటీ ఎఫ్‌ఆర్వో యోగేష్‌, ఝాన్సీరాణి, విజయ్‌ప్రకాష్‌, సెక్షన్‌ అధికారులు మహేందర్‌, విజయ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): పులల రక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యమ వుతుందని ఎఫ్‌ఆర్వో సుభాష్‌ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్ర మంలో ఎంఈవో జయరాజ్‌, ఏఎస్సై మను, డిప్యూటీ ఎఫ్‌ఆర్వో హైమావతి, ఎఫ్‌బీవోలు ప్రభాకర్‌, సుకృ, ఉపాధ్యాయులు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎఫ్‌ఆర్వో ప్రవీఫ్‌కుమార్‌ మాట్లాడుతూ పులుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అంతరించి పోతున్న జాతిని రక్షించడం మనందరి కర్తవ్యమని అన్నారు. పులుల రక్షణ ద్వారా పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవచ్చని, భవిష్యత్‌ తరాలకు వాటిని అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ ఆర్వో శశిధర్‌, ఎఫ్‌ఎస్‌ఓ తులసీదాస్‌, తిరుపతి, అతరుద్దీన్‌, ప్రసాద్‌రావు, మోతిలాల్‌, వందన, ఎఫ్‌బీఓలు లక్ష్మి, రవీనా, శ్రీదేవి, అనూష, సంతోష్‌, మల్లికార్జున్‌, అరవింద్‌, అరుణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): అడవుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్ద పులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని రేంజ్‌ అధికారి ముసావీర్‌ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ సునీత, డిప్యూటీ ఆర్వో శ్రావణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జొడెఘాట్‌ అటవీ క్షేత్రాధికారి జ్ఞానేశ్వర్‌ అధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా అటవీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, సీఐ వెలుప్పల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:27 PM