Share News

టీఎల్‌ఎంతో విద్యార్థులకు సులభ బోధన

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:16 PM

టీఎల్‌ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధ న చేయడానికి అవకాశం ఉంటుం దని అధ్యాపకుల బోధనా నైపుణ్యా లను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టీఎల్‌ఎం ఒక దిక్సూచిగా పని చేసి కొత్తఆవిష్కరణకు నాంది పడుతుందని డీఈవో రమేష్‌ కు మార్‌ అన్నారు.

టీఎల్‌ఎంతో విద్యార్థులకు సులభ బోధన

- విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా

కందనూలు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : టీఎల్‌ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధ న చేయడానికి అవకాశం ఉంటుం దని అధ్యాపకుల బోధనా నైపుణ్యా లను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టీఎల్‌ఎం ఒక దిక్సూచిగా పని చేసి కొత్తఆవిష్కరణకు నాంది పడుతుందని డీఈవో రమేష్‌ కు మార్‌ అన్నారు. గురువారం నాగర్‌క ర్నూల్‌ పట్టణంలోని లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి టీఎల్‌ఎం (టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) మేళా ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధనకు టీఎల్‌ఎం కొత్త ఆవిష్కరణకు దిక్సూచిగా పని చేస్తుందని అ న్నారు. తరగతి గదిలో టీఎల్‌ఎం అత్యం త అవసరమన్నారు. రెడిమేడ్‌గా కాకుండా ఉ పాధ్యాయులు సొంతంగా తయారు చేసిన టీఎల్‌ఎంను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితా లు వస్తాయన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలను రూపొందించిన ఉపాధ్యాయులకు మెమెంటోను అందజేశారు. అంతకు ముందు సెక్టోరియల్‌ అధికారులు కిరణ్‌కుమార్‌, శోభారా ణి, మండల విద్యాధికారులు మేళాను ప్రారం భించారు. జిల్లా స్థాయిలో టీఎల్‌ఎం మేళా 200 ప్రదర్శనలను ప్రదర్శించారు. నాలుగు విభాగాల నుంచి 8 ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారులు కిరణ్‌కుమార్‌, నూరుద్దీన్‌, శోభారాణి, మురళీధ ర్‌రెడ్డి, జిల్లా టెస్ట్‌ బుక్‌ మేనేజర్‌ నరసింహులు, గణాంక అధికారి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యా యుడు కవి గుడిపల్లి నిరంజన్‌, వెంకటేశ్వర్లు శెట్టి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్‌, ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

tel

Updated Date - Sep 18 , 2025 | 11:16 PM