Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:32 AM
తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పులు విరమణ ప్రకటన ఊహించని పరిణామని మావోయిస్టు పార్టీ తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సిగ్నల్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది..
తెలంగాణ మావోయిస్టు పార్టీ నిర్ణయంపై స్పందించిన తూర్పు ప్రాంతీయ బ్యూరో
తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పులు విరమణ ప్రకటన ఊహించని పరిణామని మావోయిస్టు పార్టీ తూర్పు ప్రాంతీయ బ్యూరో (ఈఆర్‌బీ) ప్రతినిధి ‘సిగ్నల్’ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది. తెలంగాణ మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రభుత్వంతో ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఎలాంటి నోటీసులు లేకుండా, అధికారికంగా ప్రకటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిందని, కనీసం అక్కడి పరిణామాల గురించి తమకు చెప్పకపోవడం బాధాకరమని తెలిపారు. సీఆర్‌బీ ప్రాంతంలో (ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్) జరగుతున్న సాయుధ, నిరాయుధ లొంగుబాట్లు, ఒప్పందాలను ఈఆర్‌బీ ఖండిస్తోందన్నారు. అవి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని, విప్లవ ఉద్యమంలో ఒడుదుడుకులు సహజమని, వాటిని దాటుకుంటూ తమ పార్టీ ఈ దశకు చేరుకుందని సిగ్నల్ ఆ లేఖలో పేర్కొన్నారు.