kumaram bheem asifabad- ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:36 PM
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారంవీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కల్కెటర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, మిషన్ భగరీథ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారంవీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కల్కెటర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, మిషన్ భగరీథ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకంఉండా తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు, మురుగు కాలువ శుభ్రత, రహదారులపై మురికి నీరు నిలువల తొలగింపు, దోమల వృద్ధిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తెగిన రహదారులు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని చెప్పారు. రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పంచాయతీ అదికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతలమానేపల్లి మండలంలో రహదారులు తెగిపోగా రూ.20 లక్షల వ్యయంతో సత్వరమే మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పారిశుఽధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పంచాయతీ రాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు.