kumaram bheem asifabad- వైభవంగా దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:29 PM
జిల్లాలో గురువారం దసరా సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆసిపాబాద్ మండలంలో గురువారం దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దవాగు సమీపంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో అర్చకులు మధుకర్ శర్మ, మహేష్ శర్మ, శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వమించారు.
- జమ్మి పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు
- పలు చోట్ల రావణాసురుడి ప్రతిమల దహనం
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/రెబ్బెన/వాంకిడి/హెగాం/కెరమెరి/సిర్పూర్(టి)/పెంచికలపేట/చింతలమానేపల్లి/బెజ్జూరు, అక్టోబరు 3 (ఆంద్రజ్యోతి): జిల్లాలో గురువారం దసరా సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆసిపాబాద్ మండలంలో గురువారం దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దవాగు సమీపంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో అర్చకులు మధుకర్ శర్మ, మహేష్ శర్మ, శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వమించారు. రావాణసూరుడి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్కీ ద్వారా యువ రచయిత రాధాకృష్ణ రావాణ దాహన కార్యక్రమానికి ఎంపికయ్యారు. రాత్రి 7.30 గంటలకు రావణాసూరుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ట్రాఫిక్‌కు సిబ్బందులు లేకుండా సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్, బుల్లితెర దర్శకుడు నిర్మాత నాగబాల సురేష్ కుమార్, బీజేపీ నాయకులు విశాల్, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, వివేక్, వెంకన్న, శ్రీనివాస్, రమేష్, మధు, లక్ష్మణ్‌మూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకన్న, మల్లేష్ తదితరుల పాల్గొన్నారు. ఘనంగా దసరా వేడుకలు కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి తమ వాహనాలకు పూజలు చేశారు. స్థానిక త్రిశూల్ పహాడ్‌పై వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హరీ్‌ష్ బాబు షమీపూజ చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాత్రి రావాణసురుడి ప్రతిమకు దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు ఆయాపార్టీల నాయకులు పట్టణ వాసులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తమ అభిమానులు, కార్యకర్తలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వాంకిడి మండలంలో ప్రజలు ఘణంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ తమ వాహనాలను శుభ్రంగా కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మండల కేంద్రానికి సమీపంలో గల జమ్మి చెట్టుకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెజ్జూరు మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దహెగాం మండలంలో శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దహెగాం పోలీసు స్టేషన్‌లో ఆయుధ పూజ నిర్వహంచారు. కెరమెరి మండల వ్యాప్తంగా దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. రెబ్బెన మండలంలోని చారిత్రాత్మక ప్రదేశమైన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రెబ్బెన ఎల్లమ్మ గుడి, గోలేటి భీమన్న స్టేడియంలలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకును తెంపుకొని ఒరికొకరు ఇంచిప్పుచుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్క ర్‌రెడ్డి, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్(టి) మండలం గురువారం దసరా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే బాలాజీ వేంకటేశ్వరస్వామి వద్ద రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల మధ్య పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై సురేష్‌ల ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. పెంచికలపేట మండలంలోని ఆలయాల్లో దసరా సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతలమానేపల్లి మండలంలో గ్రామస్థులు భాజాభజంత్రీల మధ్య శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు.