ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లో దుర్గాపూజ
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:44 AM
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా బాలానగర్ డివిజన్, రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం.
బాలానగర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా బాలానగర్ డివిజన్, రాజీవ్‌గాంధీ నగర్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి, వైస్ ప్రెసిడెంట్ శ్రుతికీర్తితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి శ్రుతికీర్తితో కలిసి ప్రత్యేక పూజలు
పూజల కోసం వచ్చిన డైరెక్టర్ దంపతులను ప్రచురణకర్త శేషగిరిరావు, ప్రింటింగ్ ప్రెస్ డీజీఎంలు రాంప్రసాద్, చినబాబు, చౌదరి, సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు.

ఈ పూజల్లో ప్రింటింగ్ స్టోర్స్ మేనేజర్ వైసీ నర్సింహా, అసిస్టెంట్ మేనేజర్లు భానుప్రకాశ్, హరికృష్ణ, మాధవరావు, ఆర్‌ఎం అనిల్‌కుమార్, సిబ్బంది కే రాజు, సింహాచలం, సురేశ్, బార్గవ, నిర్మల యాదవమ్మ, సాంబ, కిషోర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.