దళితులపై దాడి సంఘటనలో డీఎస్పీ విచారణ
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:05 PM
మండల పరిధిలోని పెద్దకార్పాముల గ్రామంలో ఈనెల 6వ తేదీన సాగుభూముల విషయంలో ఓ వర్గానికి చెందినవారు దళితులపై దౌర్జన్యంగా దాడి చేసి గాయపర్చిన సంఘటనపై శనివారం నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్ విచార ణ చేశారు.
పెద్దకొత్తపల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని పెద్దకార్పాముల గ్రామంలో ఈనెల 6వ తేదీన సాగుభూముల విషయంలో ఓ వర్గానికి చెందినవారు దళితులపై దౌర్జన్యంగా దాడి చేసి గాయపర్చిన సంఘటనపై శనివారం నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్ విచార ణ చేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన దళి త కుటుంబాల వారి నుంచి డీఎస్పీ వాంగ్మూ లాన్ని పంచుల సమక్షంలో రికార్డు చేసుకున్నా రు. అనంతరం బాధితులను పెద్దకొత్తపల్లి పోలీ స్‌స్టేషన్‌కు రప్పించుకున్నారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులను గురించి ఆయన వివ రాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా పెద్దకార్పాముల శివారులో సీలింగ్ చట్టం ప్రకారంగా 1977లో సర్వే నెంబ ర్లు 15, 16, 17లో 16:30ఎకరాల భూమిని నిరు పేద దళితులకు రెవెన్యూ అధికారులు తమ పూ ర్వీకుల పేర పట్టాలు ఇచ్చారు. వారి మరణానం తరం వారి కుమారుల పేర్ల మీద 17మందికి భూములు పట్టాలు చేసుకున్నారు. ఈ భూము ల తమవి అంటూ కొందరు బీసీ వర్గం వారు ప ట్టాదారులైన దళితుల్లో నిడిగొండ సిద్దార్థ, భార్య రేష్మ, పడాల మహేష్, కల్మూరి బాల మశయ్య, వంశీతోపాటు మరో ఇద్దరిపై ఈ నెల 6వ తేదీన వ్యవసాయ క్షేత్రంలో దాడికి పాల్పడిన సం ఘ టన విధితమే. ఈ సంఘటనపై 12మందిపై ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు అదేరోజు పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు(7వ తేదీన) దాడిని ఖండిస్తూ మండల కేంద్రంలో ద ళిత బాధితులు నిరసన వ్యక్తంచేశారు. ఈ కేసు తీవ్రతను గుర్తించిన జిల్లా అధికారులు శనివా రం డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్, కొల్లాపూర్ సీఐ మహేష్, స్థానిక ఎస్‌ఐ సతీష్ సంఘటన ప్రదే శంలో బాధితులతో విచారించారు. ఇదిలా ఉండ గా బాధిత దళితులను పెద్దకొత్తపల్లి పోలీస్ స్టే షన్‌లో ఎమ్మార్పీఎస్ కోళ్ల శివ పరామర్శించారు.