Share News

Delay in Result Announcement: డీఎస్సీ 2024 స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ఆందోళన

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:27 AM

డీఎస్సీ 2024 స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించిన సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోందంటూ అభ్యర్థులు...

Delay in Result Announcement: డీఎస్సీ 2024 స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ఆందోళన

  • ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై నిరసన

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2024 స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించిన సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోందంటూ అభ్యర్థులు శుక్రవారం ప్రజాభవన్‌లోని ప్రజావాణి వేదిక ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డికి తమ సమస్యను వివరించారు. డీఎస్సీలో 2ు స్పోర్ట్స్‌ కోటా కింద 96 టీచర్‌ పోస్టులు ఉంన్నాయి. ఈ పోస్టులకు 393 మంది క్రీడాకారులు క్వాలిఫై కాగా, అధికారులు 33 మందిని మాత్రమే ఎంపిక చేసి పోస్టింగులు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. ఈ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, జాతీయ స్థాయి క్రీడాకారులైన తమను పక్కన పెట్టి, జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారని వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, రీ-వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించింది. దీంతో గత నవంబర్‌లో సర్టిఫికెట్ల రీ-వెరిఫికేషన్‌ పూర్తయినప్పటికీ, ఇంతవరకు ఫలితాలను వెల్లడించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలను వెంటనే వెల్లడించి, క్రీడల్లో మెరిట్‌ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 03:27 AM