Share News

ఎండుతున్న పంట పొలాలు

ABN , Publish Date - Mar 10 , 2025 | 01:20 AM

వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఈ సీజన లో పడిన కష్టం నష్టంగా మారేలా ఉం ది. పచ్చని పొలాల్లో భూమికి పచ్చని పందిరి వేసినట్లు ఉండే వరి పంటలు భూగర్భజలాలు అడుగంటుతుండటం ఎండిపోయిన పైర్లన్నీ ఎర్రగా పసుపుపచ్చగా మారుతున్నాయి.

 ఎండుతున్న పంట పొలాలు

ఎండుతున్న పంట పొలాలు

అడుగంటిన భూగర్భజలాలు

ట్యాంకరుతో బతికించుకుంటున్న రైతులు

ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు

వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఈ సీజన లో పడిన కష్టం నష్టంగా మారేలా ఉం ది. పచ్చని పొలాల్లో భూమికి పచ్చని పందిరి వేసినట్లు ఉండే వరి పంటలు భూగర్భజలాలు అడుగంటుతుండటం ఎండిపోయిన పైర్లన్నీ ఎర్రగా పసుపుపచ్చగా మారుతున్నాయి. వ్యవసాయానికి మూలాధారమైన నీరు లేక సాగు చేసిన రైతుల కు కన్నీరు మిగులుతోంది. చేసిన కష్టంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా వృథాగా మారుతోంది. కొ న్ని చోట్ల సాగు నీరు అందక ఎండుతున్న పొలాల ను కాపాడుకునేందుకు కొందరు రైతులు ట్యాం కర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అలా చేసినా పూర్తి స్థాయిలో నీరండక పొలాలు ఎండిపోతున్నాయి. పంట చేతికందక పోవడంతో రైతులు వ రి కంకులను కోసి గేదెలకు వేస్తున్నారు.పలుచోట్ల పంటలపై ఆశలు వదులుకొని గేదేలకు మేపుతున్నారు.

(ఆంధ్రజ్యోతి,చిట్యాలరూరల్‌)

చిట్యాల మండలంలో సుమారు 13,200 ఎకరాల్లో వరిని సాగు చేశారు. నాటు వేసి వరిపైర్లు పెరిగే కొద్దీ రోజురోజుకు నీటిని అందించే మోటార్లు నీటి ధార తగ్గుతూ వస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైనది. వరి కంకులు దాదాపుగా ధాన్యం గింజలుగా మారే సమయంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని వనిపాకల, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, వట్టిమర్తితో పాటుగా పలు గ్రామాల్లో వరి చేన్లు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నీరంద కపోవడంతో ఎండిన పంటను చూసి పలువురు కన్నీరు పెడుతున్నారు. పంటను వదులుకోలేక పలు గ్రామాలకు చెందిన రైతలు పంటలకు నీటిని కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. కానీ అది సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు నీరందించలేక ఆశలు వదులుకున్నారు. మరి కొంద రు రైతులు సాగు చేసిన పంటలో కనీసం 60శాతం పంటనైనా కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు. దీంతో పచ్చని పొలాలకు నీరందక ఎండి వరి కంకులు ఎర్రగా మారి ఎండిపోతున్నాయి. వ్యవసాయాధికారుల సర్వే ప్రకారం మండలంలో సుమారుగా 520 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిం ది. అనధికారికం గా అంతకు పైగా వరి పంట ఎండిపోయి ఉంటుంది. భూగర్భజలాలు తగ్గడంతో తమ వరి పంటలకు సకాలంలో నీటినందక ఎండిపోయాయని, 24 గంటల కరెంటు కూడా ఇందుకు ఒక కారణమని పలువురు రైతులు పేర్కొంటున్నారు. 24 గంటల కరెంటును తగ్గించి దానిని 18 గంటలు ఇస్తే సకాలంలో కొంత మేర భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

24గంటల కరెంటును తగ్గించాలి

వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ సరఫరాను తగ్గించాలి. 24 గంటల కరెంటు వల్ల రైతులు మో టార్లను ఆనచేసి అలానే ఉంచుతున్నారు. దీంతో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. పెద్ద మోటార్లు ఉన్న రైతులకు ఇబ్బందులు లేకుండా సాగు చేసిన పంట కొంత చేతికి వచ్చే అవకాశం ఉండగా చిన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తన భూమితో పాటు బంధువుల భూమిని కౌలుకు తీసుకొని 12 ఎకరాల్లో సాగుచేయగా సుమారు 8 ఎకరాల వరకు ఎండిపోయింది. మిగిలిన 4 ఎకరాల్లో కూడా ఎంత చేతికి అందుతుంతో తెలియని సరిస్థితి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత సరఫరాను తగ్గించాలి.

నర్రా సత్తిరెడ్డి, రైతు, వట్టిమర్తి

భూగర్భజలాలలు తగ్గడం వల్లే...

మండలంలోని పలు గ్రామాల్లో వరిచేలు ఎండిపోవడం బాధాకరం. పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గడం వల్లే వరి పంటలు ఎండుతున్నాయి. 13200 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. గ్రామాల్లో భూగర్భజలా ల మట్టం తగ్గిన ప్రాంతంలో సుమారు 520 ఎకరాల్లో వరిచేలు ఎండిపోయినట్లు నిర్ధారించాం.

పగిడిమర్రి గిరిబాబు, ఏవో, చిట్యాల

Updated Date - Mar 10 , 2025 | 01:20 AM