Narcotics Raids: కోటి విలువైన మత్తు మందులు సీజ్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:25 AM
మత్తు మందు రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపినట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా జరిపిన దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా..
హైదరాబాద్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): మత్తు మందు రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపినట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా జరిపిన దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా, రూ.1.09 కోట్ల విలువైన మత్తు మందు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భువనేశ్వర్-ఫుణె ఎక్స్‌ప్రె్‌సలో గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసిన ఈగల్ రైల్వే టీం రూ.22.75 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వరంగల్‌లో 32 కిలోల గంజాయి జప్తు చేసి ముగ్గురు, ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయి స్వాధీనంతో ఇద్దరు, వరంగల్ జిల్లా ఐనవోలులో 214 కిలోల గంజాయి జప్తు చేసి ఒకరిని అరెస్టు చేసినట్లు సందీప్ శాండిల్య తెలిపారు. ఆల్ర్ఫాజోలం తయారీ యూనిట్‌పై దాడి చేసిన సంగారెడ్డి బృందం.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిందన్నారు.