Share News

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలను నిరోధించాలి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:11 PM

మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త భారత్‌ అభియాన్‌ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలను నిరోధించాలి
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త భారత్‌ అభియాన్‌ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాల వ్యతిరే పోరాటం కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్‌ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీలు, ఆర్‌ఐలు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత సమాం లక్ష్యంగా మాద్ద్రవ్యాల నివారణ కొరకు ప్రతినిత్యం అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్సై మధుకర్‌ తెలిపారు. నాషా ముక్త్‌ భారత్‌ అభిమాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం మోడి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులచే డ్రగ్స్‌ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లితండ్రులకు, సోదరులకు గంజాయి వాటడం వల్ల కలిగే నష్టాను తెలిపారు. అనంతరం డ్రగ్స్‌ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం తెలపాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆయన వెంట పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వాంకిడి,(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు ప్రలజ దూరంగా ఉండాలని ఎస్సై తులసీరాం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌ వద్ద స్థానిక ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై తులసీరాం, ఏఎస్సై పోశెట్టి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం రోజు రోజుకు పెరుగుతుందని, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువత పెడదారి పడుతున్నారని అది ఒక వ్యసనంగా మారుతుందన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:11 PM