Share News

డ్రగ్స్‌ వాడకం ఎంతో చేటు

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:06 PM

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ఎంతో చేటని, డ్రగ్స్‌ రహిత సమాజం కోసం యువత పూర్తిస్థాయిలో అవగా హన కలిగి ఉండాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

డ్రగ్స్‌ వాడకం ఎంతో  చేటు
మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, పోలీసు సిబ్బంది

- నషా ముక్తి భారత్‌ అభియాన్‌ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌, ఎస్పీలు

నాగర్‌కర్నూల్‌/ కందనూలు/ కొల్లాపూర్‌/ లింగాల/ తెలకపల్లి/ ఉప్పునుంతల/ తాడూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ఎంతో చేటని, డ్రగ్స్‌ రహిత సమాజం కోసం యువత పూర్తిస్థాయిలో అవగా హన కలిగి ఉండాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. నషాముక్తి భారత్‌ అభియాన్‌ ముగిం పు కార్యక్రమం సందర్భంగా మంగళవారం జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో జిల్లా విభిన్న ప్రతి భావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించేం దుకు ప్రతీ ఒక్కరు సహకారం అందించాలన్నా రు. జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్‌ సెంటర్‌ ద్వారా అవగాహన కల్పిస్తూ మత్తు విముక్తికి వైద్యం అందిస్తుందన్నారు. ఎక్క డైనా మాదక ద్రవ్యాల బా రిన పడిన వారు ఉంటే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలిరావాలని కలెక్టర్‌ సూ చించారు. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమిత మైన మత్తుపదార్థాలు, డ్రగ్స్‌ ప్రస్తుతం గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తు న్నదని, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్‌ సూచిం చారు. అనంతరండ్రగ్స్‌ వద్దు బ్రో అంటూ అందరితో నినా దాలు చేయించి మాదక ద్ర వ్యాల వినియోగానికి వ్యతి రేకంగా కలెక్టర్‌ అందరితో ప్ర తిజ్ఞ చేయించారు. అవగా హన వాల్‌పోస్టర్లను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, పీడీ డీ ఆర్‌డీఏ చిన్న ఓబులేష్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి యాదగిరి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి ఫిరంగి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, వి విధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, వి ద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రిలో డాక్టర్‌ నరహరి, డాక్టర్‌ కోటేశ్వర్‌, డాక్టర్‌ ప్రశాంత్‌, డా క్టర్‌ ఉదయ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, పరిపాలన విభా గపు సహాయ సంచాలకులు సీజే.వసంత్‌ కుమా ర్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై ప్రతిజ్ఞ చేయించారు.

ఫ ఎస్పీ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం మంగళవారం నిర్వ హించారు. ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బం ది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. డీసీఆర్‌బీ సీఐ ఉ పేందర్‌రావు, ఎస్‌బీఐ కనకయ్య, ఆర్‌ఐ జగన్‌, ఏవో కృష్ణయ్య, సీసీ బాలరాజు, జిల్లా ఆర్మ్డ్‌ రిజ ర్వ్‌ సిబ్బంది, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కొల్లాపూర్‌ పట్టణంలోని మినీ స్టేడియం లో జూనియర్‌ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల వినియోగంపై సీఐ మహేష్‌ అవగాహన కల్పించారు. ఆర్డీవో భన్సీలాల్‌, తహసీల్దార్‌ భరత్‌, బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధీర్‌లు పాల్గొన్నారు. ఫ కొల్లాపూ ర్‌లో మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రావు ఆ ధ్వర్యంలోనూ పట్టణంలో డ్రగ్స్‌, మాదక ద్రవ్యా ల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.

ఫ లింగాల జడ్పీహెచ్‌ పాఠశాలలో డ్రగ్స్‌, మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక అవగా హన సదస్సు నిర్వహించగా, ఎస్‌ఐ ఏ.వెంకటే శ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ తెలకపల్లిలోని సిద్ధార్థ మోడల్‌ స్కూల్‌, సీఎల్‌ ఆర్‌ కళాశాలలో ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐ జనార్దన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఫ ఉప్పునుంతల జడ్పీహెచ్‌లో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధంపై ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాసురెడ్డి, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు.

ఫ తాడూరులో ఎస్‌ఐ గురుస్వామి ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు.

Updated Date - Nov 18 , 2025 | 11:06 PM