మా ఊరికి బస్సు నడపండి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:10 PM
మా ఊరికి బస్సు నడిపించాలని బాణాల స ర్పంచ్ దేశ్యానాయక్ విన్నవించారు. మండల ప రిధిలోని బాణాల గ్రామానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బాణాల గ్రామ సర్పంచ్ దేశ్యా నాయక్, వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి డీఎంను కోరారు.
- బాణాల సర్పంచ్ విన్నపం
బల్మూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మా ఊరికి బస్సు నడిపించాలని బాణాల స ర్పంచ్ దేశ్యానాయక్ విన్నవించారు. మండల ప రిధిలోని బాణాల గ్రామానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బాణాల గ్రామ సర్పంచ్ దేశ్యా నాయక్, వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి డీఎంను కోరారు.
ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని చంద్రబండతండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం మంత్రి జూపల్లి సహకారంతో రూ.5లక్షలు మంజూరు చేశారు. గ్రామ సర్పంచ్ చిట్టి శంకర్ నాయక్, ఉప సర్పంచ్ కేతావత్ శంకర్‌నాయక్ ప్రహరీ నిర్మాణం కోసం సోమవారం భూమి పూజ చేశారు. వార్డుసభ్యులు ముడావత్ శంకర మ్మ, హనుమంతు నాయక్, బుట్టితారు నాయక్, గ్రా మస్థులు పాల్గొన్నారు.
ముందుకు రావడం సంతోషకరం
అచ్చంపేటటౌన్, డిసెంబ రు 29 (ఆంధ్రజ్యోతి): మం డలంలో నడింపల్లి గ్రామంలో స్టేడియం, లైబ్ర రీ ఏర్పాటు కోసం గ్రామ 8వ వార్డు మెంబర్ గడ్డం గణేశ్ సోమవారం సర్పంచ్ గోపి పద్మను కలిసి రూ.80వేల చెక్కును అందజేశారు. సర్పం చు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. గణేశ్‌ను అభినందించి శాలువాతో సత్కరించారు.
కాలనీలో నీటి ఎద్దడి పరిష్కారం
ఉప్పునుంతల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని కంసానిపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో సోమవారం సర్పంచ్‌లలిత బోరుమోటారు బిగించి కాలనీవాసులకు నీ టి ఎద్దడిని పరిష్కరించారు. కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యో తి) : ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విర మణ సహజమని దేవునితిర్మలాపూర్ స ర్పంచ్ పిల్లి పల్లవిశేఖర్ అన్నారు. సోమవా రం మండల పరిధిలోని దేవునితిర్మలాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యుడిగా పని చేస్తున్న రాజయ్య పదవీ విరమ ణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. రాజ య్యను పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్ర జాప్రతినిధులు, ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో ఎంఈవో కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వి.సత్యం, మాజీ ఎంపీటీసీలు ప్రతాప్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వి.శ్రీనివాసులు, ఉపా ద్యాయులు పాల్గొన్నారు.
సర్పంచ్‌కు సన్మానం
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని పెద్దకార్పాముల సర్పంచ్ జలాల్ చిట్టెమ్మ, వార్డు సభ్యులు శివ, బంటు అలివేలమ్మ, బీనమోని లింగస్వామి, పెద్దూరి శంకర్, సాతాని శ్రీనులను బీజేపీ మండల నా యకులు ఘనంగా సన్మానించారు. బీజేపీ మం డల అధ్యక్షుడు పరశురాముడు, జిల్లా కార్యదర్శి బెల్లి తిరుమల్‌యాదవ్, పిల్లి నాగరాజు యాద వ్, చంద్రశేఖర్, శివ, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.