kumaram bheem asifabad- తాగునీటి సరఫరా అస్తవ్యస్తం..
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:15 PM
పట్టణంతో పాటు మండల పరిధిలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో రెండు పూటల మంచినీరు అందించారు. పండుగ సమయాల్లో మంచినీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం రెండు పూటల కాదు కదా..కనీసం రెండు రోజులకోసారి కూడా మంచినీరు సరిగ్గా అందడం లేదు.
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంతో పాటు మండల పరిధిలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో రెండు పూటల మంచినీరు అందించారు. పండుగ సమయాల్లో మంచినీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం రెండు పూటల కాదు కదా..కనీసం రెండు రోజులకోసారి కూడా మంచినీరు సరిగ్గా అందడం లేదు. కాగజ్‌నగర్, కాగజ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అయ్యే నీటిని గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆయా వాడలకు నీరందడం లేదని ఆరోపణలున్నాయి. గత 15 రోజులుగా మంచినీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. కొమ్రంభీం జిల్లా వ్యాప్తంగా మంచినీరు సరఫరాకు అడ ప్రాజెక్టు నీరే ప్రధానం. అడ ప్రాజెక్టు నీటి సరఫరా విభాగంలోని కాంట్రాక్టు కార్మికులు, సిబ్బంది సమ్మె చేయడం వల్లనే నీటి సరఫరాలో జాప్యం జరుగుతుం దని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. వేత నాలు సమస్య కారణంగా కార్మికులు కొద్ది రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె ప్రభావం తోనే మంచినీటి సరఫరాలో ఇబ్బంది ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
- పెద్దవాగుతో పాటు..
కాగజ్‌నగర్ పట్టణానికి పెద్దవాగుతో పాటు అడ ప్రాజెక్టు నీరు సరఫరా అవుతోంది. అడ ప్రాజెక్టు నీటిని శుద్ది చేసి మిషన్ భగీరధ పథకం ద్వారా త్రిశూల్ పహాడ్‌పై గల రిజర్వాయర్‌లోకి నింపుతారు. పట్టణానికి 11ఎంఎల్‌డీ (రోజులకు అవసరమైన మెగా లీటర్లు) నీరు అవసరం అవుతుంది. 7 ఎంఎల్‌డీ లు అడ ప్రాజెక్టు ద్వారా, 4 ఎంఎల్‌డీలు పెద్దవాగు ఇంటేక్‌వెల్ ద్వారా సరఫరా జరుగుతోంది. కానీ పెద్దవ ాగు నుంచి సరఫరా అయ్యే మంచినీటి సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోందని పట్టణవాసులు చెబుతున్నారు. నెలలో కేవలం 20 రోజులు మాత్రమే పట్టణంలో నీటి సరఫరా సక్రమంగా జరుగుతోంది. మిగిలిన రోజుల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు పైపులైన్ లీకేజీలు తరచు జరగుతున్నాయి. వర్షాకాలంలోనే ఈవిధంగా ఉంటే వేసవి కాలంలో ఎలా ఉంటుందనేది పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంచినీరు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, రాస్‌పెల్లి, బోరిగాంతో పాటు పలు గ్రామాల్లో నీటి సరఫ రా సక్రమంగా జరగడం లేదు. ఆయా గ్రామ పంచాయ తీల్లో నెలల తరబడి బోర్లు చెడిపోయి ఉండడంతో పాటు, పైపు లైన్లు సక్రమంగా వేయకపోవ డంతో సరఫరాలో అంతరాయం కలుగుతోందని గ్రామాస్తులు పేర్కొంటున్నారు. బుదరగూడ, వంజిరీ గ్రామం పంచాయతీల్లోని ఆయా గామాల ప్రజలు మంచినీటి సరఫరాలో అంతరాయంతో ఖాళీ బిందెలతో ఆందోళన చేప ట్టారు. మహిళలు బిందెలతో నీటిని దూర ప్రాం తాల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. పలు గ్రామ పంచాయతీల్లోని అంతర్గత పెపులైన్లు, ఇతరత్ర ఇబ్బందులతోనే సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని మిషన్ భగీరథ ఏఈ పృధ్వీ తెలిపారు. నిత్యం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు.