Drill Mec International CEO Marco Tozzi: మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ మద్దతు కావాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:04 AM
గ్లోబల్ కంపెనీలకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక అంశాలు, ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్స్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని....
‘ఆంధ్రజ్యోతి’తో డ్రిల్ మెక్ సీఈవో మార్కో టోజీ
హైదరాబాద్, డిసెంబరు 8, (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ కంపెనీలకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక అంశాలు, ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్స్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని డ్రిల్ మెక్ ఇంటర్నేషనల్ సీఈవో మార్కో టోజీ కోరారు. తెలంగాణలో తమ సంస్థ ఇప్పటికే డ్రిల్లింగ్ పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించిందని, అందులో 600 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా తమకు భారత్‌లో భాగస్వామి అని చెప్పారు. ఈ కంపెనీ విస్తరణపైనా ఆలోచన చేస్తున్నామని అన్నారు. భారత ప్రభుత్వం.. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో వైవిధ్యం కోసం పనిచేస్తున్నాయని, గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తున్నాయని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతోందని, ఇటలీకి చెందిన తాను భారత్‌లో తమ సంస్థ వ్యవహారాల కోసం మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నానని తెలిపారు.