Satish Reddy Praises Operation Sindoors: ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటాం
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:36 AM
ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని డీఆర్‌డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీ్‌షరెడ్డి అన్నారు...
డీఆర్‌డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ సలహాదారు సతీ్‌షరెడ్డి
కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం
హనుమకొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని డీఆర్‌డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీ్‌షరెడ్డి అన్నారు. భారత్ ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతను చూసి ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను సతీశ్‌రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ను మించిన సాంకేతికతను సిందూర్‌లో మనం దేశం ఉపయోగించిందన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. గతేడాది రూ.24 వేల కోట్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈ సంవత్సరం అది రూ.50 వేల కోట్లకు పెరగనుందని చెప్పారు. మన దేశంలో యూనివర్సిటీల ద్వారా 4.3 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రపంచంలో నైపుణ్యం కలిగిన యువతలో 40 శాతం మంది మన దేశం వారే ఉంటారని అన్నారు. వికసిత్ భారత్-2047తో శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం మరింత అభివృద్ధిని సాధిస్తోందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. కేయూ వీసీ ప్రతా్‌పరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రావు, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులతో పాటు 650 మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరయ్యారు.