Dr. Ramesh Reddy: కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా డాక్టర్ రమేశ్‌రెడ్డి
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:04 AM
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ కె. రమేశ్ రెడ్డి నియమితులయ్యారు.....
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ కె. రమేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనే ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇంతకుముందు వీసీగా ఉన్న నందకుమార్ రెడ్డి పీజీ పరీక్షల్లో అవకతవకల ఘటనలో రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం కీలకమైన యూజీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ రంగంలో అనుభవం ఉన్న డాక్టర్ రమేశ్ రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యవిద్యలో ఆయనకు ఉన్న అనుభవం, గతంలో వైద్యవిద్య సంచాలకులుగా పనిజేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది.