Share News

Dr. Raghuram: డాక్టర్‌ రఘురామ్‌కు గౌరవ ఎఫ్‌ఆర్‌సీఎస్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:18 AM

కిమ్స్‌ ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ డిసీజెస్‌ సెంటర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ..

Dr. Raghuram: డాక్టర్‌ రఘురామ్‌కు గౌరవ ఎఫ్‌ఆర్‌సీఎస్‌

  • దక్షిణాసియాలో ఈ ఘనత సాధించిన తొలి వైద్యుడు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కిమ్స్‌ ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ డిసీజెస్‌ సెంటర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లోని రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ గ్లాస్గో సంస్థ ఆయనకు గౌరవ ఎఫ్‌ఆర్‌సీఎ్‌స(ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజీ సర్జన్స్‌)ను ప్రదానం చేసింది. దక్షిణాసియాలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డులకెక్కారు. 1997లో పరీక్ష రాయడం ద్వారా ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పొందిన ఆయన.. ఇప్పుడు అదే కాలేజీ నుంచి గౌరవ ఎఫ్‌ఆర్‌సీఎస్‌ అందుకున్నారు. గ్లాస్గోలోని చారిత్రక రాయల్‌ కాలేజీ హాల్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ రఘురామ్‌కు కాలేజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హనీ ఎటీబా ఈ ఫెల్లోషి్‌పను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హనీ ఎటీబా మాట్లాడుతూ డాక్టర్‌ రఘురామ్‌కు తమ కాలేజీ తరఫున గౌరవ ఫెల్లోషిప్‌ అందించడం ఆనందంగా ఉందన్నారు. రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు డాక్టర్‌ రఘురామ్‌ అందించిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. అనంతరం డాక్టర్‌ రఘురామ్‌ మాట్లాడుతూ అత్యున్నత గౌరవ ఫెల్లోషి్‌పను ప్రదానం చేసినందుకు ఆర్సీపీఎస్జీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 04:18 AM