Share News

Dr. Benjamin: ఎంఎన్‌జే ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బెంజిమిన్‌

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:41 AM

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ బెంజిమిన్‌ నియమితులయ్యారు....

Dr. Benjamin: ఎంఎన్‌జే ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బెంజిమిన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ బెంజిమిన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్‌గా శ్రీనివాస్‌ ఉన్నారు. అయితే, ఆయన ఏపీ క్యాడర్‌కు చెందినవారు. ఉద్యోగుల విభజనలో భాగంగా శ్రీనివా్‌సను ఏపీకి కేటాయించారు. అక్కడ పోస్టు లేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడే ఎంఎన్‌జే డైరెక్టర్‌గా నియమించారు. తాజాగా ఆయనను మళ్లీ ఏపీకి కేటాయించడంతో ఆయన స్థానంలో, నిబంధనల మేరకు ఎంఎన్‌జేలో సీనియారిటీ జాబితాలో మొదటి వరుసలో ఉన్న బెంజిమిన్‌కు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలను అప్పగించారు.

Updated Date - Sep 11 , 2025 | 05:41 AM