డబుల్ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:31 PM
డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యా ల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో గల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నాయకు లతో కలిసి సందర్శించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యా ల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో గల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నాయకు లతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు రాజీవ్‌నగర్‌లో 320 డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణమయ్యాయన్నారు. లబ్దిదారుల ఎంపిక విషయం లో మీడియా సమక్షంలో పేదవారికి లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను మంజూ రు చేశారన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదలకు మంజూరైన ఇళ్లను లబ్దిదారుకు కేటాయించకుండా మోసం చేస్తుం దన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు పేరు వస్తుందన్న అసూయతో రాజకీయ కక్షతో కేటాయించడం లేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదవారి నుంచి ప్రతి ఇంటికి రూ. 50 వేలు వసూలు చేస్తుందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకుల అనుచరులకే మంజూరయ్యాయన్నారు. కలెక్టర్ స్పందిం చి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. లేకుం టే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.