అర్హులకే డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:19 PM
గృహాలు లేని నిరుపేదల గృహ వసతి కోసమే డబు ల్ బెడ్‌రూం గృహాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అర్హులకే వాటిని అందజేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రి టౌన్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): గృహాలు లేని నిరుపేదల గృహ వసతి కోసమే డబు ల్ బెడ్‌రూం గృహాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అర్హులకే వాటిని అందజేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని డబుల్ బెడ్‌రూం గృహాలను సందర్శించి వాటిని పరిశీలిం చారు. అనంతరం ఇటీవల ఎంపిక చేసిన 240 మం ది గృహ లబ్ధిదారులకు పలువురికి గృహ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఎవరికైన అనుమానాలు ఉంటే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. మిగిలినటువంటి డబుల్‌బెడ్‌రూంలను కూడ అర్హులనే ఎంపిక చేస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారా యణ పాల్గొన్నారు. లబ్దిదారులు వారి వారి నివాసాల కు తాళాలు వేసుకున్నారు.
ఫపట్టణంలోని ఐటీఐ ప్రాంగణంలో ఇటీవల నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను పరి శీలించారు. పనుల పురోగతి గురించి అడిగి తెలుసు కున్నారు. ఈ సెంటర్‌లో ఆయా కోర్సులు పూర్తి చేసు కున్నవారికి ఆయ పరిశ్రమల నిర్వాహకులు నేరుగా ఎంపిక చేసుకొని ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. అ నంతరం అక్కడి నుంచి పాఠశాలను సందర్శించి వి ద్యార్థులను విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. పలువురి విద్యార్థులకు అక్షరాలు దిద్దించారు. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు.
ఫపట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ రాజలింగును పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.