Share News

kumaram bheem asifabad- ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించొద్దు

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:25 PM

గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో కోడ్‌ అమలు కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా చట్టపర చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్‌ అమలును అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అమలు కానుం డగా, ఆయా గ్రామాల్లో కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రకటించడం గానీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయయవద్దు

kumaram bheem asifabad- ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించొద్దు
లోగో

- రూ.50వేలకు మించి నగదు తరలిస్తే ఇబ్బందులు

- పల్లెల్లో అధికారుల పక్కా నిఘా

బెజ్జూరు/వాంకిడి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో కోడ్‌ అమలు కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా చట్టపర చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్‌ అమలును అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అమలు కానుం డగా, ఆయా గ్రామాల్లో కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రకటించడం గానీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయయవద్దు. ఇప్పటికే ప్రారంభమై ఉన్న పథకాలు మాత్రం యథావి ధిగా కొనసాగుతాయి. ఎన్నికల సందర్బంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ మండల పరిధిలో ప్లయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్టీ బందాలు తనిఖీలు నిర్వహించ నున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ప్రజలు రూ.50వేలకు మించి నగదును తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. తరలించే నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు ఉంటే సరి, లేదంటే తనిఖీ బృందాలు పట్టుకొని సీజ్‌చేస్తాయి. ప్రజలు సాధ్యమైనంత మేర ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహిం చడం ఉత్తమం. ఏదైనా శుభకార్యాలకు వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తే అధికారులకు తెలియజేసి ఆధారాలు చూపించాలి. జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే నగదు రైతుల బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. అదే ప్రైవేటు వ్యాపా రులు, మిల్లర్లకు విక్రయిస్తే నగదు రూపంలో డబ్బు చెల్లిస్తారు. అయితే సంబంఽ దిత వ్యాపారుల నుంచి సరైన ఆధారాలు తీసుకున్న తర్వాతే రైతులు డబ్బు తీసుకె ళ్లాలి. అదే విధంగా ఎవరైనా పెద్ద మొత్తంలో వస్తువులు తరలించినా, నిల్వ చేసినా సరైన ఆధా రాలు లేకుంటే అధికారులు సీజ్‌చేసి కేసు నమోదు చేస్తారు.

- అనుమతి తప్పనిసరి..

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నం దున ఎక్కడైనా, ఎవరైనా ఏదైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా సంబంఽ దిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుం టారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌ జనరల్‌ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.2వేలు, రిజర్వేషసన్‌ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.1000, వార్డు సభ్యులు జన రల్‌ స్థానాల్లో పోటీచేసే వారు రూ.500, రిజర్వేషన్‌ ఉన్నచోట పోటీ చేసే అభ్యర్థులు రూ.250మాత్రమే ఖర్చు చేయాలి.

నిబంధనలకు లోబడి నడుచుకోవాలి..

- సర్తాజ్‌పాషా, ఎస్సై, బెజ్జూరు

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి. ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదును తీసుకెళ్లద్దు. సాధ్య మైనంత వరకు ఆన్‌లైన్‌ లావాదేవీలను ఉపయోగిం చుకోవాలి. పత్రికలు, న్యూస్‌ చానళ్లలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌పై ప్రత్యేక నిఘా ఉంటుంది. ప్రచారానికి సంబంధించి ముందుగా అధికారుల నుంచి అనుమ తులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.

Updated Date - Nov 28 , 2025 | 10:25 PM