Share News

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:29 PM

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ అన్నారు. ఇంటర్నేషనల్‌ యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్‌ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ

kumaram bheem asifabad- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ

ఆసిఫాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ అన్నారు. ఇంటర్నేషనల్‌ యాంటీ డ్రగ్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్‌ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడకంతో జీవితాలు నాశనమై భవిష్యత్‌ లేకుండా పోతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యతో పాటు మంచి ఆరోగ్యం కోసం నిత్యం యోగా, వ్యాయమం చేయాలన్నారు. అనం తరం పోలీసు మిత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణ సీఐ రవీందర్‌ విద్యార్థులకు డ్రగ్స్‌ నివారణపై ప్రొజెక్టర్‌ ద్వారా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ అధికారిణి అంజలీదేవి, ఎస్సై అంజయ్య, ప్రిన్సిపాల్‌ యాదగిరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సంతోష్‌, అబ్దుల్‌ రహీం, ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్‌, చంద్రశేఖర్‌, రాజకుమార్‌, ఉదయ్‌ కిరణ్‌, మహేష్‌, సంతోష్‌, ప్రేంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:29 PM