kumaram bheem asifabad-విధులను నిర్లక్ష్యం చేయొద్దు
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:20 PM
ఎన్నికల సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు. సిర్పూర్(టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ భూపాలపట్నం ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడత పోలింగ్‌కు సిబ్బంది శనివారం తరలి వెళ్లారు.
వాంకిడి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు. సిర్పూర్(టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ భూపాలపట్నం ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడత పోలింగ్‌కు సిబ్బంది శనివారం తరలి వెళ్లారు. ఇందుకు గాను 163 పీఓలు, 208 ఓపీఓలను నియమించారు. మండలంలోని ఈడెన్ గార్డెన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బందిని పోలీసు బందో బస్తు ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు తరలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పోలింగ్‌లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దానిని పరిశీలిం చాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. పోలింగ్ కేంద్రంలో సామగ్రిని సరి చూసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ రహీముద్దీన్, ఎన్నికల సిబ్బంది గిరీష్, ఎస్సై సురేష్‌తో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బంది ఉన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏరాపట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మండలంలోని 188 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పీవోలు 214, ఓపీవోలు 229తో పాటు 500 మందికి పైగా సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో డిస్ట్రిబూయషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించి సూచనలు చేశారు. మండలంలో 22 గారమ పంచాయతీలు ఉండగా 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 188 వార్డు స్థానాలు ఉదహెగాంలో..
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ నస్రూల్లాఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా 224 పీఓలు, 244 మంది ఏపీఓలు, 500 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ఆవరణలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా 22093 మంది ఓటర్లు ఉన్నారు. 24 గ్రామ పంచాయతీలకు గాను 76 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, అలాగే 200 వార్డు స్థానాలకు 13 ఏకగ్రీవం కాగా మిగిలిన 187 స్థానాల్లో 400 మందికి పైగా సభ్యులు పోటీ పడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ భూపాలపట్నం ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడత పోలింగ్‌కు సిబ్బంది శనివారం తరలి వెళ్లారు. ఇందుకు గాను 163 పీఓలు, 208 ఓపీఓలను నియమించారు. మండలంలోని ఈడెన్ గార్డెన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బందిని పోలీసు బందో బస్తు ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు తరలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పోలింగ్‌లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దానిని పరిశీలిం చాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. పోలింగ్ కేంద్రంలో సామాగ్రిని సరి చూసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ రహీముద్దీన్, ఎన్నికల సిబ్బంది గిరీష్, ఎస్సై సురేష్‌తో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బంది ఉన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం జరుగనున్న సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్దం చేసినట్లు ఎంపీడీఓ ఆల్బర్ట్ తెలిపారు. మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు 102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 12 పంచాయతీలకు 49 మంది సర్పంచ్‌లు బరిలో ఉండగా వార్డులకు 233 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు సిబ్బందికి అందజేసిన బస్సుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు పోలీసు బందో బస్తులో తరలించారు. మండల ఎన్నికల పరిశీలకులు సురేష్, స్పెషల్ అధికారి ప్రభాకర్, డీఎస్‌పీ వహిదుద్దీన్, ఎస్సై అనీల్‌కుమార్, తహసీల్దార్ తిరుపతి పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 గ్రామ పంచాయతీలకు గాను 85 పోటీలో ఉన్నారు. 183 వార్డు స్థానాలకు గాను 461 మంది పోటీలో ఉన్నారు. ఆరు రూట్లుగా విభజించారు. సామాగ్రి పంపిణీ కేంద్రంలో డీఆర్‌డీఓ దత్తారాం ఆధ్వర్యంలో ఎంపీడీవో ప్రసాద్‌లు ఎన్నికల సిబ్బందికి సామగి పంపిణీ చేశారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండలంలో 19 మంది సర్పంచ్ స్థానాలకు 67 మంది పోటీలో ఉన్నారు. వార్డు స్థానాలకు గాను 402 మంది పోటీ పడుతున్నారు. మండలంలో ఐదు రూట్లుగా విభజించినట్లు ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో సిబ్బందిని పంపించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.