Share News

kumaram bheem asifabad-పొరపాట్లు జరుగనివ్వొద్దు

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:24 PM

నామినేషన్ల ప్రక్రియలో పొరపాట్లు జరుగనివ్వొద్దని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కేస్లాగూడ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

kumaram bheem asifabad-పొరపాట్లు జరుగనివ్వొద్దు
కెరమెరిలో వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

కెరమెరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియలో పొరపాట్లు జరుగనివ్వొద్దని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కేస్లాగూడ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల పనులను నాణ్యతగా చేపట్టాలని సూచిచారు. ఆయన వెంట ఎంపీడీవో సురేష్‌కుమార్‌, ఎంపీవో సాయిరాంగౌడ్‌, కార్యదర్శి గణేశ్‌ పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి రోజు సర్పంచ్‌ స్థానాలకు ఏడు నామినేషన్లు ధాఖలు చేశారు. రెండో రోజు శుక్రవారం మూడు క్లస్టర్లలో కలిపి సర్పంచ్‌ స్థానాలకు 20 మంది నామినేషన్లు వేశారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యతి): మండలంలోని ఉషేగాం నామినేషన్‌ క్లస్టర్‌ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించారు. ఈ ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్ల విషయాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పట్నాపూర్‌, మాని జండాగూడ, పవర్‌ గూడ తదితర గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండల వ్యాప్తంగా ఆరు క్లస్టర్లలో వార్డు స్థానాలకు 32 మంది, సర్పంచ్‌ స్థానాలకు 30 మంది నామినేషన్లు వేశారని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని స్థానిక సంస్థలు ఎన్నికల నమినేషన్‌ క్లస్టర్‌ కేంద్రాని శుక్రవారం అదసపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పరిశీలించారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్‌ తీరును అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. మండలంలోని మొత్తం 15 గ్రామ పంచాయతీలకుగానూ శుక్రవారం 14 మంది సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేశారని అధికారులు తెలిపారు.

Updated Date - Nov 28 , 2025 | 10:24 PM