Share News

kumaram bheem asifabad- కన్నవారికి శోకం మిగుల్చవద్దు

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:19 PM

యువత క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుని కన్న వారికి శోకం మిగుల్చవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండ లంలోని ఆగర్‌గూడ గ్రామానికి చెందిన తుమ్మిడి రాజశేఖర్‌ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడంతో శనివారం అతడి తల్లి లక్ష్మిని పరామర్శించారు. తన వంతుగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు.

kumaram bheem asifabad- కన్నవారికి శోకం మిగుల్చవద్దు
బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

పెంచికలపేట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): యువత క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుని కన్న వారికి శోకం మిగుల్చవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండ లంలోని ఆగర్‌గూడ గ్రామానికి చెందిన తుమ్మిడి రాజశేఖర్‌ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడంతో శనివారం అతడి తల్లి లక్ష్మిని పరామర్శించారు. తన వంతుగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చడం సరికాదన్నారు. అలాగే పారాక్విట్‌ అనే గడ్డి మందు విరివిగా దుకాణాల్లో దొరుకుతుందని చెప్నారు. ఆ గడ్డి మందు తాగితే నూటికి నూరు శాతం మంది చనిపోతున్నారనే విషయాన్ని అసెంబ్లీలో తాను ప్రస్తావిం చానని గురుత చేశారు. అనంతరం గెండపల్లి గ్రామానికి చెందిన సిడాం రాధ, ఎల్లూరుకు చెందిన మాజీ సర్పంచ్‌ గణపురం కృష్ణమూర్తి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు రాజేశ్వర్‌, నగేష్‌, నాన్నయ్య, పురుషోత్తం, వెంకన్న, సంతోష్‌, అనంతరావు, కాంతారావు, భీమయ్య, కిషన్‌ ఉన్నారు.

రైతులను పలకరించి.. విత్తనాలు పెట్టి..

పెంచికలపేట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుండెపల్లి గ్రామ శివారులో పొలం పనుల్లో ఉన్న రైతులను ఎమ్మెల్యే హరీష్‌బాబు శనివారం పలుకరించి మహిళలతో కలిసి పత్తి విత్తనాలు పెట్టారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు. శనివారం మండలంలో పర్యటించారు. తిరిగి వెళ్తున్న క్రమంలో గుండెపల్లి గ్రామ శివారులో మహిళా రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. వెంటనే ఆయన కూడా మహిళా రైతులతో కలిసి విత్తనాలు విత్తారు. సాగు సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఎరువులు సకాలంలో అందుతున్నా యా,, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారా అని అడిగి తెలుసుకు న్నారు. అధికారుల సూచనలు పాటించి దిగుబడులు సాధించాలని సూచించారు.

Updated Date - Jun 28 , 2025 | 11:19 PM