Share News

అర్జీలపై నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:07 PM

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్ర జలు వారి సమస్యలపై అందజేసే అర్జీలపై అ ధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెకటర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నారు.

అర్జీలపై నిర్లక్ష్యం చేయొద్దు
ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- ప్రజావాణిలో కలెక్టర్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్ర జలు వారి సమస్యలపై అందజేసే అర్జీలపై అ ధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెకటర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నారు. అదనపు కలెక్టర్లు పి.అమ రేందర్‌, దేవసహాయంతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 50 ఫి ర్యాదులు అందాయి. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీ లించి తదుప రి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అదేవిధంగా సీఎంవో ప్రజావాణి పెండింగ్‌ కేసు లను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కలె క్టర్‌ ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికా రులు పాల్గొన్నారు.

ఇసుక రవాణాను అరికట్టాలి

ఉప్పునుంతల, (ఆంధ్రజ్యో తి) : మండల పరిధిలోని దా సర్లపల్లి గ్రామ సమీపంలోని దుందుభీ వాగు నుంచి అను మతులు లేకుండా ఇసుక ు తరలిస్తున్నారని, వెంటనే అరి కట్టాలని కోరుతూ సోమవా రం కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌కు దాసర్లపల్లి సర్పంచ్‌ రమేష్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ శంకర్‌ వినతిపత్రం అందజేశారు.

పోలీస్‌ ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌ క్రైం, (ఆంధ్రజ్యోతి) : పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్‌ ఎస్పీ ఎన్‌. వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నిర్వహించి న పోలీస్‌ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారుల తో స్వయంగా ఆయన మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఫి ర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించా లని ఆదేశించారు.

Updated Date - Dec 29 , 2025 | 11:07 PM