Share News

మానసిక వైకల్యం కలిగిన వారిపై వివక్ష చూపొద్దు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:17 PM

మానసిక వైకల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం వివక్ష చూపరాదని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జిల్లా సెక్రటరీ జి.సబిత అన్నారు.

మానసిక వైకల్యం కలిగిన వారిపై వివక్ష చూపొద్దు
మాట్లాడుతున్న లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జిల్లా సెక్రటరీ సబిత

- లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జిల్లా సెక్రటరీ జి.సబిత

కందనూలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : మానసిక వైకల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం వివక్ష చూపరాదని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జిల్లా సెక్రటరీ జి.సబిత అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యా య సేవాధికార సంస్థ నాగర్‌కర్నూ ల్‌ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడలోని న ర్సింగ్‌ కళాశాలలో మంగళవారం నిర్వ హించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. మానసిక వైకల్యం చెందిన వారి పట్ల ప్రతీ ఒక్కరు సుహృద్భావంతో మెల గాలని అన్నారు. వారికి ప్రేమానురాగాలు పంచాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సార్‌ సత్యనారాయణ, ప్యానల్‌ అడ్వకేట్‌ చిలుక లక్ష్మయ్య, ప్యానల్‌ అడ్వకేట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి గౌసియా, ఉపాధ్యాయినులు, విద్యార్థి నులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:17 PM