ర్యాగింగ్‌తో జీవితం అంధకారం చేసుకోవద్దు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:05 PM
విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. మంచిర్యాల మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సరదా పేరుతో ర్యాగింగ్‌లకు పాల్పడవద్దన్నారు. ర్యాగింగ్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏసీపీ ప్రకాశ్
మంచిర్యాలక్రైం,ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. మంచిర్యాల మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సరదా పేరుతో ర్యాగింగ్‌లకు పాల్పడవద్దన్నారు. ర్యాగింగ్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్ చేయడం వల్ల కేసులు నమోదై వారి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సూచించారు. యాంటిర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కమిటీలో కళాశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఏ చిన్న సమస్య తలెత్తిన యాజమాన్యానికి సమాచారం అందించాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారితో పాటు యాజమాన్యంపై కూడ చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే విద్యపై శ్రద్ధ చూపించా లన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, కళాశాల యాజమాన్యం, మెడికల్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.