kumaram bheem asifabad- శ్రమదానం చేసి.. చెత్తాచెదారం తొలగించి..
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:42 PM
సింగరేణి ఉద్యోగులు గురువారం శ్రమదానం చేసి చెత్తాచెదారం తొలగించారు. స్పెషల్ క్యాంపెయిర్ 5.0 కార్యక్రమంలో భాగంగా గురువారం గోలేటిలోని శ్రీ సత్యసాయి బాబా ఆలయం, జీటీసీఓఏ క్లబ్ పరిసరాల్లో స్వచ్ఛత కోసం శ్రమదానం చేశారు
రెబ్బెన, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఉద్యోగులు గురువారం శ్రమదానం చేసి చెత్తాచెదారం తొలగించారు. స్పెషల్ క్యాంపెయిర్ 5.0 కార్యక్రమంలో భాగంగా గురువారం గోలేటిలోని శ్రీ సత్యసాయి బాబా ఆలయం, జీటీసీఓఏ క్లబ్ పరిసరాల్లో స్వచ్ఛత కోసం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా జీఎంతో పాటు ఏరియా అధికారులు, ఉద్యోగులు చెత్త, గడ్డి, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. గాలి వానకు విరిగి పోయి ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. స్వచ్ఛత కోసం సింగరేణి సిబ్బంది పడుతున్న శ్రమను, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరును జీఎం ప్రశంసించారు. బొగ్గు ఉత్పత్తి, కార్యాలయాల్లో విధులే కాకుండా సమాజ శ్రేయస్సు, పరిసరాల శుభ్రత కోసం బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని జీఎం విజయభాస్కర్‌రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి తిరుపతి, ఉజ్వల్‌కుమార్ బెహారా, ఎస్‌ఓటు జీఎం రాజమల్ల, డీజీఎం మదీనాభాషా, ఇన్విరాల్‌మెంట్ అధికారి హరీష్, జ్ఞానేశ్వర్, శ్రీధర్, రవికుమార్, సాగర్, ఐటీ మేనేజర్ ముజీబ్, శ్రీనివాస్, స్వామి, ఈఈ రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, సుష్మ పాల్గొన్నారు.