డీసీసీ పీఠం బీసీలదేనా...!
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:48 PM
జిల్లా కాం గ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై రోజు రోజుకూ అంచనా లు తారుమారు అవుతున్నాయి. ఊహకందని విధంగా ఏఐసీసీ అధిష్టానం డీసీసీ పదవుల భర్తీ చేప ట్టనుండ టంతో అసలు పదవి ఎవరికి వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.
-బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో వారికే ఇస్తారనే చర్చ
-బలం చేకూరుస్తున్న పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు
-దరఖాస్తుదారుల్లో పలువురు బీసీ నాయకులు
మంచిర్యాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా కాం గ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై రోజు రోజుకూ అంచనా లు తారుమారు అవుతున్నాయి. ఊహకందని విధంగా ఏఐసీసీ అధిష్టానం డీసీసీ పదవుల భర్తీ చేప ట్టనుండ టంతో అసలు పదవి ఎవరికి వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. డీసీసీ పదవి కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఏఐసీసీ పరిశీల కులు సురేష్‌కుమార్ ఈ నెల 16 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిం చారు. జిల్లా లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పర్యటించిన ఆయన ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. స్వీకరించిన దరఖాస్తులు ఇప్పటికే ఢిల్లీలోని ఏఐ సీసీ పెద్దలకు అందజేయగా, త్వరలో పదవిని భర్తీ చే యనున్నారు. డీసీసీ పదవుల భర్తీ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల సీఎం రే వంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అ ధ్యక్షుడు మహేష్‌గౌడ్‌లతో ఢిల్లీలో కీలక సమావేశం ఏ ర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా సేకరించా రు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత గా బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాస్థాయి నా యకత్వ మార్పులపై కేసీ వేణుగోపాల్ చర్చించారు. దీంతో జిల్లాలోనూ డీసీసీ పదవి భర్తీలో మార్పులు జ రిగే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.
బీసీలకే డీసీసీ పదవి దక్కుతుందా...!
ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామా జిక న్యాయం పాటించాలనే సమాలోనలు బీసీలకే పద వి దక్కుతుందనే వాదానికి బలం చేకూరుస్తోంది. ఈ సందర్భంగా అన్ని వర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలనే ఆలోచనకు పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఓసీ, బీసీ, ఎస్సీ, మహిళల కేటగరీల్లో బల మైన నేతలు ఎవరున్నారని ఆరా తీసినట్లు సమాచా రం. మరోవైపు సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యమ ని రాహుల్ గాంధీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి జనాభా దామాషానా డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం విధిత మే. ఈ అంశానికి సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగులో ఉండటంతోపాటు హై కోర్టులో కూడా బీ సీ రిజర్వేషన్లపై తీర్పు వాయిదా పడటంతో రాష్ట్ర వ్యా ప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వే షన్ల అంశం కీలకంగా మారింది. మరోవైపు ఢిల్లీలో జరి గిన సమావేశంలో డీసీసీల భర్తీలోనూ ఆ దిశగా ఎంపి క ఉండాలనే అభిప్రాయాన్ని కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల్లో బీసీ అంశాన్నే ప్ర స్తావిం చారనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా డీసీసీల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కూడా స్పష్టం చేసినందున బీసీ అం శానికి బలం చేకూరుస్తుండగా, ఈ సారి డీసీసీ పదవి బీసీలకు ఇవ్వడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
ఆశల పల్లకిలో బీసీ నాయకులు....
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠాన్ని బీసీలకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెం ట్ల పరిధిలో మొత్తం 29 మంది ఆశావహులు దరఖా స్తు చేస్తుకున్నారు. దరఖాస్తుదారుల్లో సీనియర్లు, గతం లో వివిధ పదవులను అలంకరించిన వారితోపాటు కొ త్తవారు కూడా ఉన్నారు. వీరిలో బీసీ సామాజిక వర్గా నికి చెందిన నాయకులు పది మంది వరకు ఉన్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జనాభానే అధికంగా ఉంది. డీసీసీ పదవి భర్తీలో సామాజిక న్యా యం పాటిస్తామని ఏఐసీసీ, పీసీసీ కూడా ప్రకటించి నందున బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సెగ్మెంట్ల పరిధిలో డీసీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మంచిర్యాల నియో జక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీని యర్ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ (కాంగ్రెస్ సేవాదల్ స్టేట్ జనరల్ సెక్రెటరీ), ముత్తినేని రవికు మార్ (ఏఐసీసీ స్టేట్ కో ఆర్డినేటర్), వంగల దయానం ద్, గడ్డం త్రిమూర్తి, నరేంధర్ నాయుడు ఉండగా, బె ల్లంపల్లి నియోజక వర్గం నుంచి సీనియర్లు కారుకూరి రాంచందర్, మత్తమారి సూరి బాబు, బండి ప్రభాకర్, తొంగల మల్లేష్, ఎండీ అఫ్జల్ ఉన్నారు. బీసీ నాయకుల్లో సమర్థవంతమైన వారికి డీసీసీ పదవి ద క్కే అవకాశాలు ఉండగా, పార్టీ వైఖరిలో మార్పులు సంభవిస్తే మాత్రం బీసీలతో పాటు ఓసీ, ఎస్సీ సామా జిక వర్గాలకు చెందిన సీనియర్లు, పార్టీని ఏకతాటిపై నడిపగల వ్యక్తికి డీసీసీ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి.