Share News

Cheriyal Government Hospital: చేర్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుడికి మెమో

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:01 AM

చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి వచ్చిన రోగి కుటుంబసభ్యుడితో అనుచితంగా వ్యవహరించిన డాక్టర్‌కు అధికారు లు మెమో జారీ చేశారు. ‘చచ్చేవారికి సిరప్ ఎందుకు?’ అనే వ్యాఖ్యపై ఆంధ్రజ్యోతి కథనం వెలువడడంతో అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.

Cheriyal Government Hospital: చేర్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుడికి మెమో

చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?

వ్యాఖ్యలపై అధికారుల చర్యలు ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

చేర్యాల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తితో అనుచితంగా మాట్లాడిన సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభు త్వ ఆస్పత్రి వైద్యుడు కల్యాణ్‌ చక్రవర్తిపై అధికారు లు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. పట్టణానికి చెందిన దాసరి అనిల్‌కుమార్‌.. తన కూతురు కడుపునొప్పితో బాధపడుతుందంటూ ఆదివారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి సిరప్‌ కావాలని కోరగా.. డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ‘చచ్చేవారికి సిరప్‌ ఎందుకు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. చర్యలు తీసుకోవాలని జిల్లా, ఆస్పత్రి వైద్యాధికారులకు సూచించారు. దీంతో డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తికి మెమో జారీ చేసినట్లు ఇన్‌చార్జి వైద్యాధికారి దామోదర్‌ తెలిపారు. అయి తే.. అనిల్‌కుమార్‌ ఆస్పత్రికి తాను మాత్రమే వచ్చి సిరప్‌ కావాలని అడిగారని చెప్పారు. ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 04:01 AM