Financial Dispute: కరీంనగర్‌లో వైద్యుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:37 AM
స్నేహితులు తన వద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది కరీంనగర్‌కు చెందిన డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ (42) అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు.
అప్పుగా తీసుకున్న డబ్బును స్నేహితులు ఇవ్వడం లేదనే..
కరీంనగర్ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): స్నేహితులు తన వద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది కరీంనగర్‌కు చెందిన డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ (42) అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ శీనివాస్ నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన వింజనురి కరుణాకర్ డాక్టర్ శ్రీనివాస్ వద్ద రూ.1.50 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. అలాగే, కిరణ్, కవిత, వెంకటి నరహరి అనే ముగ్గురు స్నేహితులు శ్రీనివాస్ పేరిట రూ.1.35 కోట్లు బ్యాంకులో రుణం తీసుకున్నారు. బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం శ్రీనివాస్ నుంచి రూ.28 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వీరంతా ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ శ్రీనివాస్ బ్యాంకు వాయిదాలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. అప్పు తీర్చమని స్నేహితులను అడిగితే... డబ్బు ఇవ్వమని, ఏమి చేసుకుంటావో చేసుకో అని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ చేతికి ఇంట్రావీనస్ ఇంజక్షన్ కాన్యులా పెట్టి ఉంది.