Share News

దళారులకు ధాన్యం అమ్మవద్దు

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:47 PM

రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన మొక్క జొన్న ధాన్యాన్నిదళారులకు అమ్మ వద్దని పెద్దకొత్తపల్లి సింగిల్‌విం డో చైర్మన్‌ బుడుగు శ్రీనివాస్‌ యా దవ్‌ సూచించారు.

దళారులకు ధాన్యం అమ్మవద్దు
పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌

- సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌

పెద్దకొత్తపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన మొక్క జొన్న ధాన్యాన్నిదళారులకు అమ్మ వద్దని పెద్దకొత్తపల్లి సింగిల్‌విం డో చైర్మన్‌ బుడుగు శ్రీనివాస్‌ యా దవ్‌ సూచించారు. ఆదివారం పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కజొ న్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నకు ప్ర భుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లు ప్రకటించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే మొక్క జొన్న ధాన్యాన్ని 14శాతం తేమ ఉండే విధం గా తీసుకురావాలని, రైతుపేరు మీదటోకెన్‌ ఉం డాలని, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌, అ కౌంట్‌ నెంబరు తీసుకుని సెంటర్‌ దగ్గరికి రా వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ మెరుగురాజు, సీఈవో సిరాజుద్దీన్‌, సొసైటీ డైరెక్టర్లు వెంకటమ్మ, కృష్ణశర్మ, యాదగిరి, కార్యాలయ సిబ్బంది గడ్డి కోపుల రాములు, హాసిన, బాలు, వెంకటేశ్‌, లక్ష్మ య్య, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 10:47 PM