ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:07 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్ర శాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మంచిర్యా ల ఏసీపీ ప్రకాష్ అన్నారు. శనివారం దండేపల్లి మండలం వెల్గనూర్‌లో పోలీసు కవాతు నిర్వహించారు.
మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
దండేపల్లి డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్ర శాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మంచిర్యా ల ఏసీపీ ప్రకాష్ అన్నారు. శనివారం దండేపల్లి మండలం వెల్గనూర్‌లో పోలీసు కవాతు నిర్వహించారు. ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ ఓటు హ క్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు స్వేచ్చయుత వాతావరణంలో ఓటు హక్కు ను ప్రశాంతంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, మంచిర్యాల మహిళ పోలీసుస్టేషన్ సీఐ నరేష్, దండే పల్లి, లక్షెటిపేట, జన్నారం ఎస్సైలు తహసీ నోద్ధీన్, గోపతి సురేష్, గొల్లపెల్లి అనూష పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పోలింగ్ కేంద్రాలను ఏసీ పీ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అల్లర్లు సృష్టించేందుకు ఎదరన్నా ప్రయత్నిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలని అ న్నారు. అనవసరంగా యువత గొడవల్లో ఇరుక్కుని కేసుల పాలు కావద్దని ఆయన సూచించారు.