Share News

kumaram bheem asifabad- ఉపాధ్యాయుల డ్యూటీలు తనిఖీ చేయొద్దు

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:33 PM

: ఉపాధ్యాయులు డ్యూటీలు తనిఖీ చేయవద్దని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్‌ మహాసభలో ఆమె మాట్లాడా రు.

kumaram bheem asifabad- ఉపాధ్యాయుల డ్యూటీలు తనిఖీ చేయొద్దు
మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి

సిర్పూర్‌(టి), నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు డ్యూటీలు తనిఖీ చేయవద్దని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్‌ మహాసభలో ఆమె మాట్లాడా రు. పాఠశాలల పర్యవేక్షణ కోసం ఇప్పటికే మండలానికి ఒక ఎంఈవో, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌, ఎంఎన్‌వోలు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇతర జిల్లాల అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. కానీ మళ్లీ పర్యవేక్షణ నిమిత్తమైన ఉపాధ్యాయులను ప్రైమరీ స్కూల్స్‌, హైస్కూల్స్‌, అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ లెవల్‌ లోపల తనిఖీ చేయడానికి కొన్ని టీంలు వేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం సరైన విధానం కాదన్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు బడికి దూరమై విద్యార్థులకు సరైన బోధన అందదని తెలిపారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు హరీష్‌, హరీష్‌కుమార్‌, తరుణ్‌, సబినా, రమణ, రాము, సందీప్‌, ప్రమోద్‌, సెలెస్టినా, ఐశ్వర్య, సాయి ప్రవీణ్‌, జహీర్‌, సాబీనా, సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 10:33 PM