Share News

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN , Publish Date - Jun 04 , 2025 | 10:58 PM

కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూసుకోవా లని తేమశాతం 17శాతం వరకు ఉన్న ధాన్యా న్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులకు ఇబ్బం దులు కలిగించవద్దని అధికారులను కలెక్టర్‌ బ దావత్‌ సంతోష్‌ ఆదేశించారు.

 రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కొనుగోలు కేంద్రంలో హమాలీలు, డ్రైవర్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కోడేరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూసుకోవా లని తేమశాతం 17శాతం వరకు ఉన్న ధాన్యా న్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులకు ఇబ్బం దులు కలిగించవద్దని అధికారులను కలెక్టర్‌ బ దావత్‌ సంతోష్‌ ఆదేశించారు. బుధవారం మం డల పరిధిలోని పసుపుల గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీలకు ధాన్యం ఎక్కిస్తున్న హమాలీలతో లారీ డ్రైవర్‌తో మాట్లాడా రు. రోజు ఎంత ధా న్యం మిల్లులకు తర లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, ఐకేపీ ఏపీ ఎం పార్వతమ్మ, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

మొదటి విడత పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంపికైన ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని లబ్ధిదా రులను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ కోరారు. మం డల పరిధిలోని పసుపుల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 10:58 PM